భారతదేశం, ఏప్రిల్ 26 -- ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లైనప్‍లోని ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై కూడా మంచి క్రేజ్ ఉంది. హరి హర వీరమల్లు, ఓజీ చిత్రాల తర్వాత ఆ మూవీని పవన్ చేయనున్నారు. అయితే, ప్రస్తుతం డిప్యూటీ సీఎం విధుల్లో బిజీగా ఉన్న ఆయన సినిమాలను ఎప్పుడు పూర్తి చేస్తారో ఇంకా క్లారిటీ రాలేదు. మే 9న విడుదల కావాల్సిన హరి హర వీరమల్లు చిత్రం వాయిదా పడింది. ఓజీ విషయంలోనూ ఇంకా కన్‍ఫ్యూజన్ ఉంది. ఈ తరుణంలో, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్ విషయంలో తాజాగా బజ్ బయటికి వచ్చింది.

ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కోసం పవన్ కల్యాణ్ రూ.170కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నారంటూ ప్రస్తుతం బజ్ నడుస్తోంది. ఆ రేంజ్‍లో భారీ మొత్తం అందుకోనున్నారంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఈ ఊహాగానాలే నిజమైతే తెలుగు ఇండస్ట్రీలో ఓ చిత్...