భారతదేశం, జూలై 31 -- విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'కింగ్డమ్' (Kingdom) ఇవాళ (జూలై 31) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను తన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో కలిసి విజయ్ దేవరకొండ మీట్ అయ్యాడు. ప్రొడ్యూసర్ నాగవంశీ, ఉస్తాద్ భగత్ సింగ్ హీరోయిన్ శ్రీలీల కూడా వీళ్లతో జాయిన్ అయ్యారు. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన కింగ్డమ్ మూవీ ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిర్మాత నాగ వంశీ, విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే వెళ్లి పవన్ కళ్యాణ్ ను తన రాబోయే చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్‌లో కలిశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ఎక్స్ లో పోస్టు చేసింది. శ్రీలీల కూడా భాగ్యశ్రీ పక్కన నిలబడి ఉండగా, పవన్ మధ్యలో నిలబడి కనిపించారు.

దీని...