Hyderabad, జూన్ 16 -- కొన్ని పాటలు కాలాతీతం. ఎప్పుడు విన్నా, ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తూనే ఉంటుంది. అలాంటిదే చంద్రలేఖ మూవీలోని ఉరుములు నీ మువ్వలై పాట కూడా. ఎప్పుడో 1998లో వచ్చిన చంద్రలేఖ మూవీలోని సాంగ్ ఇది. ఈ పాటలోని మెలోడీ మన మనసుల్ని తాకుతుంది. కాలంలో మనల్ని వెనక్కి తీసుకెళ్తుంది.

తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతా పని చేసిన సినిమాలు చాలా తక్కువే. కానీ వాటితోనే తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాడు. నిన్నే పెళ్లాడుతా అయినా, చంద్రలేఖ అయినా.. అతని మెలోడీ మనపై తిరుగులేని ముద్ర వేసింది. కృష్ణవంశీ డైరెక్షన్ లో 1998లో వచ్చిన చంద్రలేఖలోని ఈ ఉరుములు నీ మువ్వలై పాట కూడా అలాంటిదే.

రాజేష్, సుజాత వాయిస్ ఈ పాటను మరో లెవెల్ కు తీసుకెళ్లాయి. సినిమా మొత్తం ఒకెత్తయితే ఈ సాంగ్ మరో ఎత్తు. నాగార్జున, రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్, ...