భారతదేశం, జనవరి 6 -- లాస్ వెగాస్‌లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ ఈవెంట్ CES 2026 ఒక అద్భుతమైన ఆవిష్కరణకు వేదికైంది. భవిష్యత్తులో మనం ప్రయాణించే పద్ధతినే మార్చేసేలా.. ఉబర్ (Uber), లూసిడ్ (Lucid Group), న్యూరో (Nuro) సంస్థలు కలిసి తమ కొత్త 'రోబోటాక్సీ'ని (Robotaxi) సోమవారం ప్రపంచానికి పరిచయం చేశాయి. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో డ్రైవర్ ఉండరు, అన్నీ సెన్సార్లే చూసుకుంటాయి.

ఈ ప్రాజెక్టు కోసం మూడు దిగ్గజ సంస్థలు చేతులు కలిపాయి. లూసిడ్ గ్రూప్ తన అత్యంత శక్తివంతమైన 'లూసిడ్ గ్రావిటీ' (Lucid Gravity) ప్లాట్‌ఫారమ్‌ను వాహనంగా అందించగా.. న్యూరో సంస్థ అందులోని సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీని (అటానమస్ సిస్టమ్) అభివృద్ధి చేసింది. ఇక ప్రయాణికులకు కారు లోపల కలిగే అనుభవాన్ని, సర్వీస్ నిర్వహణను ఉబెర్ చూసుకోనుంది.

ఈ రోబోటాక్సీలో అత్యాధునిక సెన్సార...