భారతదేశం, జూలై 4 -- లాంగ్ గ్యాప్ త‌ర్వాత కీర్తి సురేష్ తెలుగులో న‌టించిన ఉప్పు క‌ప్పురంబు మూవీ థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ నేరుగా ఓటీటీలోకి వ‌చ్చింది. సుహాస్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ మూవీకి ఐవీ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జూలై 4న (శుక్ర‌వారం)అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. కీర్తి సురేష్ మూవీ ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా? లేదా? అంటే?

చిట్టి జ‌య‌పురం ఊరి పెద్ద (శుభ‌లేక సుధాక‌ర్‌) హ‌ఠాత్తుగా చ‌నిపోతాడు. తండ్రి స్థానంలో ఊరి పెద్ద‌గా త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో అపూర్వ (కీర్తి సురేష్‌) బాధ్య‌త‌లు చేప‌డుతుంది. అపూర్వ‌కు అధికారం ద‌క్క‌డం భీమ‌య్య (బాబు మోహ‌న్‌) , మ‌ధుబాబు(శ‌త్రు)ల‌కు ఇష్టం ఉండ‌దు. అపూర్వ ఇబ్బందులు పెట్టి ఆమె నుంచి అధికారం ద‌క్కించుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

ఆ ఊరి స్మ‌శానం రూపంలో అపూర్వ‌కు పెద్ద స‌మ‌స్య ఎదుర‌వ...