Hyderabad, జూన్ 23 -- ఆలయానికి వెళ్లి దేవుని దర్శనం అయ్యాక కాసేపు అక్కడ కూర్చొని వస్తే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. హిందూ మతం మరియు సంస్కృతిలో ఆలయ దర్శనాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. మనం ప్రతిరోజూ పూజ చేసినా, దేవాలయానికి వెళ్లినా ఒక భిన్నమైన అనుభవాన్ని ఇస్తుంది.

అక్కడ ఉన్న సానుకూల శక్తి అనేక మార్పులను తీసుకు వస్తుంది. ఆలయానికి వెళ్తే సానుకూల శక్తి ప్రవేశించి ప్రతికూల శక్తిని తొలగించుకోవచ్చు. దేవాలయానికి వెళినప్పుడు ఈ పనులు చేస్తే మరింత మంచి అనుభూతి కలుగుతుంది. మరి దేవాలయానికి ఏయే మంచి పనులు చెయ్యవచ్చు అనేది తెలుసుకుందాం.

హిందూమతంలో ప్రజలు ఆవుని గోమాతను పూజిస్తారు. గుడి చుట్టుపక్కల ఉన్న ఆవులకు బెల్లం తినిపించవచ్చు. గోశాల అనేక దేవాలయాలలో నిర్మించబడింది, కాబట్టి మీరు కూడా అక్కడికి వెళ్లి మీ చేతులతో గోవులకు బెల్లం తినిపించవచ్చు. ఇలా చేయడ...