భారతదేశం, జనవరి 8 -- మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పేరు మార్పు విషయంలో కేంద్రం తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గ్రామీణ పేదల పని హక్కును హరించి. పెద్ద పెద్ద కార్పొరేట్లకు కార్మికులు అందుబాటులో ఉండేలా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం విబీజీఆర్ఏఎంజీని ఏర్పాటు చేసిందని ఆరోపించారు.

గురువారం గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఎంతో మంది పేదలకు ఆసరాగా నిలిచిందని గుర్తు చేశారు. వలసలు, వెట్టి చాకిరీని నిర్మూలించటంలో కీలక పాత్ర పోషించిందన్నారు. గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించిందని వివరించారు.

"నేడు, అదానీ, అంబానీ వంటి పెద్ద పారిశ్రామికవేత్తలకు కార్మికులు అందుబాటులో లేరు. గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఏ రద్దుచేస్తే, గ్రామీణ పేదలు మళ్లీ పట్టణాలకు వలస వెళతారు. పేదలు మళ్లీ పట...