భారతదేశం, మే 6 -- ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకం శ్రామికుల పరిహారం, సిబ్బంది వేతనాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఏపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న శ్రామికులు పనిప్రదేశాల్లో చనిపోతే వారికి చెల్లించే ఎక్స్ గ్రేషియాను రూ.50 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచింది. ఈ మేరకు ఏపీ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

పని ప్రదేశాల్లో గాయపడి శాశ్వత వైకల్యం చెందితే పరిహారాన్ని రూ.1 లక్షకు పెంచారు. గాయపడటం ద్వారా పూర్తిగా మంచానపడితే రూ.2 లక్షల పరిహారం అందిస్తారు. పని ప్రదేశాల్లో 'ఆరేళ్ల లోపు పిల్లలు గాయపడి వికలాంగులైతే పరిహారం రూ. లక్షకు పెంచుతూ సవరణ జీవో జారీ చేశారు.

తెలంగాణలో ఉపాధి హామీ పథకం సిబ్బందికి పెండింగ్ లో ఉన్న వేతనాలపై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎ...