Hyderabad, ఏప్రిల్ 11 -- ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే రెగ్యూలర్‌గా ఆహారం తీసుకునే సమయంలో కాకుండా కొద్దిసేపు విరామం తీసుకుని ఆ తర్వాత తినడం లేదా చాలా తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తినడం. రీసెర్చర్ల నమ్మకం ప్రకారం.. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది శరీరం శక్తి కోసం గ్లూకోజ్‌ను కాకుండా కొవ్వును వాడుకునేలా చేస్తుంది. అంతేకాకుండా ఈ ఫాస్టింగ్ అనేది పేగుల ఆరోగ్యంపై ఇన్సులిన్ హార్మోన్‌పై, గ్రోత్ హార్మన్‌పై చాలా పాజిటివ్ గా పనిచేస్తుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎన్ని రకాలుంటాయి. అదెలా ట్రై చేయాలో తెలుసుకుందామా..

దీనిని బట్టి చెప్పాలంటే ప్రతి రోజూ ఒకే సమయంలో తినడం. చాలా మంది దీని కోసం 16:8 పద్ధతి వాడుతుంటారు. ఇందులో వ్యక్తి 16 గంటల పాటు తినకుండా ఉండి 8 గంటల పాటు మాత్రమే ఆహారం తీసుకుంటారు.

ఒక రోజు గ్యాప్ ఇచ్చి మరో రోజు ఆహారం తీసుకుంటూ ఉండటం దీని కిందకు వస్త...