భారతదేశం, సెప్టెంబర్ 9 -- తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో బలమైన ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరిక ఉంది. రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం,సూర్యపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, వర్షాలతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. హైదరాబాద్, సమీప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం, మెరుపులు, బలమైన గాలులు వచ్చే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశ ఉందని ఐఎండీ అంచనా వేసింది. సెప్టెంబర్ 9 నుంచి 13 మధ్యన వర్షాలు పడుతాయని వెల్లడించింది. సెప్టెంబర్లో భారీ వర్షాలు కురుస్తాయని, రికార్డు స్థాయిలో వర్షపాతం కారణంగా కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని కూడా తెలిపింద...