Telangana,hyderabad, సెప్టెంబర్ 6 -- వాయువ్య బంగాళాఖాతం,ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు పడనున్నాయి. కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

ఇవాళ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి జిల్లాలోని పలుచోట్ల ఉరుములు,మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. మరికొన్నిచోట్ల బలమైన ఉపరితల గాలులు వీచే సూచనలున్నాయి.

రేపు(సెప్టెంబర్ 7) కొత్తగూడెం, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ జిల...