Telangana,hyderabad, అక్టోబర్ 10 -- ఉత్తర తమిళనాడు తీర ప్రాంతం నుంచి దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 4.5 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా, ఏపీ, మరియు దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం..ఇవాళ కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

రేపు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర...