భారతదేశం, సెప్టెంబర్ 8 -- భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్డీఏ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఆరోగ్యం కారణంగా ఉపరాష్ట్రపతి పదవికి జగ్‌దీప్ ధన్‌కర్ రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 9న (మంగళవారం) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్‌ జరగనుంది. అదే రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.

ఉపరాష్ట్రపతి ఎన్నికలో 5 కీలక అంశాలు ఇక్కడ పరిశీలించవచ్చు.

ఈ ఎన్నికలలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు మాత్రమే ఓటు వేస్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌కు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఉంటుంది. ఈ కాలేజీలో 233 మంది రాజ్యసభ సభ్యులు (ఐదు సీట్లు ఖాళీగా ఉన్నాయి), 12 మంది నామినేటెడ్ సభ్యులు, అలాగే 543 మంది లోక్‌సభ...