భారతదేశం, ఏప్రిల్ 14 -- హైదరాబాద్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించబోతోంది. బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం కంపెనీ తన ఉద్యోగుల్లో 25 శాతం కోత విధించబోతోంది. ఏడాదికి కోటి రూపాయలకు పైగా సంపాదించే వారితో సహా పలువురు సీనియర్ అధికారులను రాజీనామా చేయమని కోరినట్టుగా తెలుస్తోంది.

కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్(ఆర్‌అండ్‌డీ) విభాగంలో పనిచేస్తున్న 50-55 ఏళ్ల మధ్య వయసున్న ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) కల్పించాలని అనుకుంటున్నారని సమాచారం. ఇప్పటికే వివిధ శాఖల్లో అధిక వేతనం పొందుతున్న పలువురు ఉద్యోగులను రాజీనామా చేయాల్సిందిగా కోరినట్టుగా తెలుస్తోంది.

2024 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లాభం 2 శాతం పెరిగి రూ.1,413 కోట్లకు చేరింది. హైదరాబాద్‌కు...