భారతదేశం, డిసెంబర్ 31 -- తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల గ్రాట్యుటీ, జీపీఎఫ్ (జనరల్ ప్రావిడెంట్ ఫండ్), సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, అడ్వాన్సులతో సహా ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను విడుదల చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల కోసం రూ.713 కోట్లను రిలీజ్ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన బిల్లులలో ఉద్యోగుల గ్రాట్యుటీ, జీపీఎఫ్ (జనరల్ ప్రావిడెంట్ ఫండ్), సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, అడ్వాన్సులకు సంబంధించిన చెల్లింపులు ఉన్నాయి. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు, ఆర్థిక శాఖ అధికారులు డిసెంబర్ 31న ఈ బిల్లులను విడుదల చేశారు.

ప్రభుత్వం గతంలో ఉద్యోగ సంఘాలకు ప్రతి నెలా రూ.700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. జూన్ నెలాఖరు నాటికి ప్రభుత్వం రూ.183 కోట్లు విడ...