భారతదేశం, జనవరి 12 -- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా కరవు భత్యం(డీఏ)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించిన అనంతరం సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 'కొంతమంది అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని బలంగా భావిస్తున్నారు. ఇది తప్పు. మనమందరం ఒకే కుటుంబం, కుటుంబంలో ఎటువంటి కుట్రలు ఉండవు. మీరు, నేను వేరు కాదు.' అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

'దేవతలు యజ్ఞం చేస్తున్నప్పుడు కూడా రాక్షసులు దానిని భంగపరచడానికి ప్రయత్నిస్తారు. ఒక శుక్రాచార్యుడు ఒక ఫామ్‌హౌస్‌లో ఉంటూ మారీచుడు లాంటి వారిని సభకు పంపుతున్నాడు.' అని విమర్శించారు సీఎం.

గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంపై రూ.8 లక్షల ...