భారతదేశం, ఏప్రిల్ 17 -- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఏపీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఔట్‌ సోర్స్డ్‌ సర్వీసెస్‌- అప్కోస్‌ జాబితాల నుంచి తొలగించక పోవడంతో వారికి సంక్షేమ పథకాలు కూడా అందడం లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పగ్గాలు చేపట్టే రాజకీయ పార్టీలు మారినపుడల్లా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగులపై వేటు వేయడం రివాజుగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ఆర్థికంగా భారంగా మారుతోందని, కాంట్రాక్టు విధానంలో ఉద్యోగుల్ని నియమించుకునే విధానానికి 90వ దశకంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొదలైంది.

ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ విధానంలో అనేక మార్పులు తీసుకు వచ్చాయి. కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాల కల్పన కాస్త ఏజెన్సీల ద్వారా నియమించుకునే పద్ధతి తర్వాత కాలంలో అమలైంది. నిర్ణీత కాల వ్యవధితో నియామకాలు, ఏజెన్సీల ద్వా...