భారతదేశం, డిసెంబర్ 11 -- ఓ ఉద్యోగిని తాను ఉద్యోగంలో చేరాల్సిన సమయానికి ముందుగా ఆఫీస్‌కు వచ్చినందుకే విధుల నుంచి తొలగింపునకు గురైంది. దాదాపు రెండేళ్ల పాటు పదే పదే ఇలా చేసిన తర్వాత కంపెనీ ఆమెను తొలగించింది. తాను ఉద్యోగం కోల్పోవడాన్ని సవాలు చేస్తూ ఆ మహిళ కోర్టును ఆశ్రయించినా, ఉద్యోగాన్ని తీసివేయడంలో యజమాని తప్పు లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

స్పెయిన్‌కు చెందిన 22 ఏళ్ల ఉద్యోగిని దాదాపు రెండేళ్ల పాటు తన ఆఫీస్‌కి ప్రతిరోజూ 6:45 AM నుంచి 7:00 AM మధ్య, అంటే షిఫ్ట్ సమయానికి 40 నిమిషాల ముందే వచ్చేది. ఆమె షిఫ్ట్ 7:30 AMకు ప్రారంభమవుతుంది. ఆఫీస్ సమయానికి ముందుగా రావద్దని యజమాని అనేకసార్లు మౌఖికంగా, లిఖితపూర్వకంగా ఆమెను కోరారు.

మెట్రో నివేదిక ప్రకారం, ముందుగా ఆఫీస్‌కు వచ్చినప్పటికీ, ఆ సమయంలో ఆమె చేయాల్సింది ఏమీ ఉండేది కాదని యజమాని ఆరోపించారు. అ...