Hyderabad, అక్టోబర్ 9 -- వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష , సురభి ప్రభావతి కీలక పాత్రలు పోషించిన లేటెస్ట్ తెలుగు థ్రిల్లర్ సినిమా అరి. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది దీనికి క్యాప్షన్. ఈ సినిమాకు జయశంకర్ దర్శకత్వం వహించారు.

ఇదివరకు పేపర్ బాయ్ సినిమాతో డైరెక్టర్‌గా మారిన జయశంకర్ చాలా కాలం గ్యాప్ తర్వాత అరి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అక్టోబర్ 10న అరి మూవీ గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో అరి సినీ విశేషాలను డైరెక్టర్ జయశంకర్ తెలిపారు.

-సినిమాల మీద ప్యాషన్‌తో మంచి ఉద్యోగం వదులుకుని ఇండస్ట్రీకి వచ్చాను. 2014లో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన నాలుగేళ్లకు 2018లో పేపర్ బాయ్ మూవీతో దర్శకుడిని అయ్యాను. తక్కువ టైమ్‌లోనే దర్శకుడివి అయ్య...