భారతదేశం, జనవరి 1 -- సిద్దిపేట జిల్లా ములుగులో ఉన్న కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయంలో 61 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఉద్యానవన ఫ్యాకల్టీ, అనుబంధ సబ్జెక్టులలోని వివిధ విభాగాలలో అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల (అసోసియేట్ ప్రొఫెసర్ 44 పోస్టులు, ప్రొఫెసర్ 17) కేడర్‌లో ఎంపిక ప్రక్రియ మెుదలైంది. అర్హతగల ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ నోటిఫికేషన్ తేదీ నాటికి అభ్యర్థులు నిర్దేశించిన అర్హతలను కలిగి ఉండాలి. పూర్తి చేసిన దరఖాస్తును 31-01-2026న సాయంత్రం 04.00 గంటలలోపు యూనివర్సిటీకి పంపాలి. పోస్టల్ ఆలస్యం కారణంగా దరఖాస్తు ఆలస్యంగా అందితే విశ్వవిద్యాలయం బాధ్యత వహించదని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల కోసం అభ్యర్థి దరఖాస్తు పత్రాన్ని, ధృవపత్రాల జిరాక్స్ కాపీలతో 31-...