భారతదేశం, ఏప్రిల్ 27 -- అది 2001, ఏప్రిల్ 27.. అతికొద్ది మంది తెలంగాణవాదుల సమక్షంలో ఓ జెండా ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా. ఏకైక అజెండాతో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. ఆ పార్టీనే 'తెలంగాణ రాష్ట్ర సమితి'(టీఆర్ఎస్). ఆ జెండానే 'గులాబీ జెండా'.! ఓవైపు ఉద్యమం.. మరోవైపు రాజకీయపంథాతో అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. అంతేకాదు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో. అధికార పీఠాన్ని కూడా కైవసం చేసుకుంది. అలా పార్టీ నుంచి ఏర్పాటు నుంచి నేటి వరకు. 25 ఏళ్ల వసంతాన్ని పూర్తి చేసుకుంది.

టీఆర్ఎస్ అనేది ఉద్యమ పార్టీగా ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక అజెండాగా ముందుకొచ్చింది. ఓ వైపు ఉద్యమం.. మరోవైపు రాజకీయపంథా...! ఇలా దశాబ్ధానికిపైగా ఎన్నో వ్యూహాలు.. ప్రతివ్యూహాలు.. అటుపోటులు ఇలా అన్నింటిని ఎదుర్కొని నిలబడింది. ఆ పార్టీ అధినేత కేసీఆర...