Telangana, ఆగస్టు 21 -- ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గోదావరి మరింత ఉద్ధృతంగా మారింది. నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఇవాళ భద్రాచలం వద్ద నీటిమట్టం 50.8 అడుగులగా నమోదైంది. దీంతో అధికారులు రెండో ప్రమాదహెచ్చరికను జారీ చేశారు.

ఇక ధవళేశ్వరం వద్ద ఇన్,ఔట్ ఫ్లో 9.88 లక్షల క్యూసెక్కులుగా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్‌లో 11.75 అడుగులకు నీటిమట్టం చేరగా. 175 గేట్లను ఎత్తారు.

ఎగువ నుంచి భారీగా వస్తున్న ప్రవాహాంతో గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. గోదావరి ఉగ్రరూపంతో లంక గ్రామాలు ప్రభావితమవుతున్నాయి. రాజమండ్రి పరిసర లంకల్లో నివసిస్తున్న 300 మంది మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

గోదావరి వరద ఉద్ధృతి నేపథ్యంలో... అల్లూరి, తూర్పుగోదావరి , కోనసీమ,...