భారతదేశం, నవంబర్ 19 -- శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై రూ.6.2 కోట్ల పరిశోధన ప్రాజెక్టుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో విస్తృతంగా వ్యాపించిన కిడ్నీ వ్యాధుల కారణాలను అధ్యయనం చేయడానికి ఐసీఎంఆర్ ఒక ప్రధాన పరిశోధన ప్రాజెక్టును ఆమోదించిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. శ్రీకాకుళం కిడ్నీ రిసెర్చ్ ప్రాజెక్ట్ పేరుతో ఈ ప్రాజెక్ట్ మూడు సంవత్సరాలలో ఐసీఎంఆర్ రూ.6.2 కోట్ల గ్రాంట్‌తో పూర్తవుతుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జరిగిన చర్చల తర్వాత ఆమోదం లభించిందని, ఐసీఎంఆర్ ఆరోగ్య పరిశోధన విభాగం ఈ అధ్యయనాన్ని చేపట్టడానికి అంగీకరించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిందని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.

రాబోయే ఒకటి నుండి రెండు సంవత్సరాలలో మూత్రపిండాల వ్యాధు...