భారతదేశం, సెప్టెంబర్ 16 -- నిజంగా ఖాళీ కడుపుతో బీట్‌రూట్ జ్యూస్ తాగడం సురక్షితమేనా? దీనివల్ల ప్రయోజనాలతో పాటు కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫోర్టిస్ లా ఫెమ్ హాస్పిటల్ పోషకాహార నిపుణురాలు రాశి చాహల్ దీని గురించి వివరిస్తూ, "బీట్‌రూట్ జ్యూస్‌లో విటమిన్లు (ఫోలేట్, విటమిన్-సి, విటమిన్ బి-9), ఖనిజాలు (ఇనుము, మెగ్నీషియం, జింక్) పుష్కలంగా ఉంటాయి. ఇది తక్కువ క్యాలరీలతో కూడిన ఒక సూపర్ ఫుడ్. బీట్ జ్యూస్‌లో ఉండే నైట్రేట్స్ నైట్రిక్ ఆసిడ్‌గా మారి శరీరంలోని రక్త ప్రసరణను పెంచుతుంది. దీనివల్ల అన్ని అవయవాలకు సరిపడా ఆక్సిజన్ అందుతుంది" అని తెలిపారు.

బీట్‌రూట్ జ్యూస్ తాగడం సురక్షితమే, కానీ ఏ సమయంలో, ఎంత మోతాదులో తాగామన్నది ముఖ్యమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. "ఖాళీ కడుపుతో తాగితే దీని ప్రయోజనాలు మరింత మెరుగ్గా అందుతాయి. ...