Hyderabad, ఏప్రిల్ 24 -- బరువు తగ్గాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఎలా తగ్గాలో తెలియక ఇబ్బందిపడతారు. బరువు తగ్గాలని నిర్ణయించుకున్నప్పటికీ సమయం లేకపోవడం వల్ల వ్యాయామం చేయలేకపోతున్నారు. ఇలాంటి వాళ్లు రోజులో కేవలం ఏడు నిమిషాల సమయం కేటాయించండి చాలు. ఆ ఏడు నిమిషాల పాటూ ఇక్కడ చెప్పిన ఎక్సర్ సైజులు చేస్తే బరువు తగ్గే అవకాశాలు ఎక్కువ.

కాబట్టి మీరు ఉదయం 7 నిమిషాలు మాత్రమే వ్యాయామం చేయడం వల్ల ఫిట్ గా ఉండవచ్చు. ఈ వ్యాయామాలు చేస్తే చాలు కొద్ది రోజుల్లోనే మీ శరీరంలో వచ్చే మార్పులను సులభంగా చూడగలుగుతారు. ఈ వ్యాయామాలను ప్రతిరోజూ ఉదయం 7 నిమిషాల్లో ఇంట్లోని ఏ మూలననైనా చేయండి.

ఇంట్లోనే జంపింగ్ జాక్స్ వ్యాయామం చేసుకోవచ్చు. మీరు మీ ఫిట్నెస్ ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటే, దీనితో ప్రారంభించండి. కాళ్ళు చాచి నిలబడి చేతులను పైకి లేపండి. ఆ తర్వాత బౌన్స్ చ...