భారతదేశం, నవంబర్ 25 -- దాదాపు 12,000 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా బద్ధలైన ఇథియోపియాలోని హైలీ గుబ్బి అగ్నిపర్వతం నుంచి వెలువడిన భారీ బూడిద మేఘం సోమవారం రాత్రి వాయువ్య భారతదేశాన్ని కమ్మేసింది! దీని కారణంగా గాలిలో విజిబులుటీ తగ్గి, పలు ప్రధాన నగరాల్లో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

గంటకు సుమారు 100-120 కిలోమీటర్ల వేగంతో, 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో పయనించిన ఈ బూడిద మేఘం రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, దిల్లీ-ఎన్‌సీఆర్, పంజాబ్‌ రాష్ట్రాల మీదుగా వ్యాపించింది. ఆ తర్వాత భారత ఉపఖండంలో తూర్పు దిశగా పయనించింది.

సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో భారత గగనతలంలోకి ప్రవేశించిన ఈ అగ్నిపర్వత బూడిద మేఘం ఆకాశాన్ని కమ్మేయడంతో విమానయాన సంస్థలు తమ విమానాలను దారి మళ్లించాల్సిన లేదా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ బూడిద మేఘం చాలా ఎత్తులో ...