Hyderabad, జూలై 15 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అదే విధంగా నక్షత్రాలను కూడా ఆ మార్పు చేస్తూ ఉంటాయి. కుజుడు త్వరలో తన నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. ధృక్ పంచాంగం ప్రకారం సూర్యుడు నక్షత్ర మండలమైన ఉత్తర ఫాల్గుణిలోకి కుజుడు జూలై 23న ప్రవేశించబోతున్నాడు. ఆ రోజు ఉదయం 8:50 గంటలకు నక్షత్రం మార్పు చెందుతుంది. ఆగస్టు 13 వరకు ఇదే నక్షత్రంలో సంచారం చేస్తాడు.

దీంతో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండడం మంచిదని, కొన్ని రాశుల వారు మాత్రం శుభ ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. మరి ఏ ఏ రాశుల వారికి కలిసి వస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలు పొందుతారు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కుజుడు నక్షత్రం మార్పు సింహ రాశి వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. భూములు, ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఆర్థిక...