భారతదేశం, నవంబర్ 17 -- ఉత్తర తెలంగాణలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలైన ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, లింబాద్రి గుట్ట, బాసరలను కలుపుతూ టెంపుల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ఆధ్యాత్మిక పర్యాటకాన్ని సామాజిక-ఆర్థిక అభివృద్ధితో అనుసంధానించే వ్యూహంలో ఒక భాగం. ఈ ఆలయాలు నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్నాయి. ఈ ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించే యాత్రికులకు రోడ్డు కనెక్టివిటీని గణనీయంగా పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రాజెక్ట్.

ఆలయ కారిడార్ అభివృద్ధి మొదటి దశలో రెండు ప్రధాన సర్కిల్‌లలో రోడ్లను అప్‌గ్రేడ్ చేయడానికి, వెడల్పు చేయడానికి ప్రభుత్వం నిధులను ఆమోదించింది. నిజామాబాద్-1 సర్కిల్‌లోని 15 రోడ్లను అభివృద్ధి చేయడానికి దాదాపు 412.33 కోట్లు కేటాయించా...