భారతదేశం, డిసెంబర్ 27 -- జీవితం మాత్రమే కాదు, మరణం కూడా ధర్మబద్ధంగా ఉండాలని భీష్ముడు మనకు సందేశాన్ని ఇచ్చాడు. అలాగే కాలాన్ని గౌరవించాలని, ఆధ్యాత్మిక చైతన్యం ఉన్నవారు కాలాన్ని అధిగమించగలరని భీష్ముడు తెలిపారు. భీష్ముడు దక్షిణాయణంలో బాణాల శయ్యపై ఉన్నాడు. కానీ ఉత్తరాయణం వచ్చే వరకు మరణం సంభవించకుండా ఉండాలని ఎదురు చూశాడు. ఉత్తరాయణంలో ఉన్నప్పుడు ప్రాణాలను విడిచి పెట్టాలని కోరుకున్నాడు.

భీష్ముడు గంగాదేవి, రాజు శాంతనుల కుమారుడు. గంగాదేవి తన కుమారుడికి అపూర్వమైన వరాన్ని ఇచ్చారు. అదే ఇచ్చామరణం. అంటే తనకు ఇష్టం వచ్చినప్పుడు మరణాన్ని స్వీకరించే శక్తిని ఇచ్చారు. ఇది మామూలు వరం కాదు. భీష్ముడు తన శరీర బాధలను అనుభవించినప్పటికీ ప్రాణాలను నిలబెట్టుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి బాణాలకు గాయపడ్డాడు. బాణాల శయ్యపై పడిపోయిన భీష్ముడు ప్రాణాలను వదలలేదు....