భారతదేశం, మే 8 -- ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో ఉదయం 9 గంటల ప్రాంతంలో గంగోత్రి వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోవడంతో ఆరుగురు మరణించారు. మరోకరు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మి నారాయణ సోదరి వేదవతి కుమారి మరణించారు. ఆమె భర్త భాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను రిషికేష్ లోని ఎయిమ్స్ కు తరలించారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు మరియు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, హుటాహుటిన సహాయ చర్యలు ప్రారంభించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, హెలీకాప్టర్ లో దాదాపు ఏడుగురు ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. వారిలో ఆరుగురు ఘటనా స్థలంలోనే మరణించగా, ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

సమాచారం తెలియగానే పోలీసులు, సైనిక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందం, అంబులెన్స్, స్థానిక అధికారులు సంఘటనా స్థలా...