భారతదేశం, మే 8 -- ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో ఉదయం 9 గంటల ప్రాంతంలో గంగోత్రి వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోవడంతో ఐదుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు మరియు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, హుటాహుటిన సహాయ చర్యలు ప్రారంభించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, హెలీకాప్టర్ లో దాదాపు ఏడుగురు ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. వారిలో ఐదుగురు ఘటనా స్థలంలోనే మరణించగా, ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

సమాచారం తెలియగానే పోలీసులు, సైనిక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందం, అంబులెన్స్, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉత్తరకాశి జిల్లాలోని భాగీరథ నది సమీపంలో హెలికాప్టర్ కూలిపోయిన వార్తను గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ధృవీకరించారు.

Published by HT Digita...