భారతదేశం, ఫిబ్రవరి 12 -- ఉతరాంధ్రలో మహా శివరాత్రికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతుంది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మహాశివరాత్రి వేడుకలకు ఉత్తరాంధ్ర సిద్ధమైంది. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం ఉండటంతో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వస్తారని భావిస్తున్నారు.

విశాఖపట్నంలో ఫిబ్రవరి 14 అర్ధరాత్రి నుండి ఫిబ్రవరి 15 సాయంత్రం వరకు గాజువాక, కూర్మన్నపాలెం, అగనంపూడి నుండి అప్పికొండకు 94 ప్రత్యేక బస్సులు నడుస్తాయని జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు ప్రకటించారు. అదనంగా 110 బస్సులు నగరంలోని వివిధ ప్రాంతాలను ఆర్‌కే బీచ్‌కు కనెక్ట్ చేస్తాయి. మత్స్యగుండమ్మకు 15 బస్సులు, కల్యాణపులోవకు ఐదు బస్సులు వెళ్తాయి.

విశాఖపట్నంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరే...