భారతదేశం, జూలై 28 -- తెలంగాణ రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ (TGMSC), హైదరాబాద్ కింద UPSC సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్-కమ్-మెయిన్స్) 2025 కోసం ఉచిత కోచింగ్ ఇవ్వనున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది .

సోమవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో TGMSC, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోసం ఉచిత కోచింగ్ హైదరాబాద్‌లోని TGMSC ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమం సివిల్ సర్వీస్ కెరీర్‌లను అనుసరించడంలో మైనారీటిలకు చెందిన ఆశావహులను ప్రోత్సహించడం, మార్గనిర్దేశం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ప్రభుత్వం పేర్కొంది.

అభ్యర్థులు మైనారిటీ వర్గాలకు చెందినవారై, గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అభ్యర్థి కుటుంబ ఆదాయం రూ. 2 లక్షలకు మించకూడదు. అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్...