భారతదేశం, నవంబర్ 13 -- దేశ రాజధాని దిల్లీలో పేలుడు ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఉగ్ర కుట్రకు ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ సమయంలోనే హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ను గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అరెస్ట్ చేసింది. ఉగ్రవాద ఆరోపణలతో అరెస్ట్ అయిన సయ్యద్ అహ్మద్ మెహియుద్దీన్ ఇంట్లో గుజరాత్ ఏటీఎస్ అధికారులు తాజాగా సోదాలు నిర్వహించారు.

రాజేంద్రనగర్‌లోని సయ్యద్ నివాసంలో మూడు గంటలపాటు సోదాలు నిర్వహించారు. కీలక పత్రాలు, రసాయనాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. దిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడుకు రెండు రోజుల ముందు ఏటీఎస్ పోలీసులు ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. అందులో మెుహియుద్దీన్ కూడా ఉన్న విషయం తెలిసిందే.

హైదరాబాద్ రాజేంద్రనగర్‌ ఫోర్త్ వ్యూ కాలనీలోని తన నివాసంలో రెండు మూడు న...