భారతదేశం, మే 5 -- ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో అమాయక పౌరులు మృతి చెందడం పట్ల సంతాపం వ్యక్తం చేసిన పుతిన్ ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి రష్యా పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. అదే సమయంలో ఈ పిరికిపంద దాడికి పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను కఠినంగా శిక్షించాలని పుతిన్ స్పష్టం చేశారు.

పహల్గామ్‌ ఉగ్రదాడిని పుతిన్ తీవ్రంగా ఖండించారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. అమాయకుల ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఆయన ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించారని చెప్పారు.

'పహల్గామ్ దాడిపై చర్చలతో పాటు భారత్-రష్యా ప్రత్యేక బంధాన్ని, అద్భుతమైన వ్యూహాత్మక భాగస్వామ...