భారతదేశం, ఏప్రిల్ 23 -- జమ్ము కశ్మీర్ పహల్ గామ్ ఉగ్రదాడి ఒక అనాగరిక చర్యగా సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఉగ్రదాడిలో మరణించిన విశాఖ వాసి చంద్రమౌళి మృతదేహానికి సీఎం చంద్రబాబు నివాళి నివాళులర్పించారు. చంద్రమౌళి కుటుంబ సభ్యులని ఓదార్చి ధైర్యం చెప్పారు.

ఉగ్రవాద చర్యలు భారతదేశాన్ని ఏమీ చేయలేవని సీఎం చంద్రబాబు చెప్పారు. దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉందని తెలిపారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించి, అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ఉగ్రదాడి జరగడం చాలా బాధకరమన్నారు.

దేశంలోని ప్రతి ఒక్కరూ ఈ దాడిని ఖండించాల్సిన అవసరముందన్నారు. పహల్ గామ్ ఉగ్రదాడిలో ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని, బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

ఉగ్రవాదులు ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి చేశారని, సరిహద్దుల్లో చొరబా...