భారతదేశం, ఏప్రిల్ 23 -- అమాయకుల ప్రాణాలను బలి తీసుకుని, కుటుంబల్లో శోకం మిగిల్చి, దేశం బాధపడేలా చేసిన ఉగ్రదాడిపై సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం (ఏప్రిల్ 22) జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో నేచర్ అందాలను ఆస్వాదిస్తున్న టూరిస్ట్ లపై ఉగ్రమూక పాశవికంగా దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, సంజయ్ దత్ తదితర సెలబ్రిటీలు రియాక్టయ్యారు.

పహల్గామ్ లో టెర్రరిస్ట్ అటాక్ క్షమించరాని క్రూరమైన చర్య అని మెగాస్టార్ చిరంజీవి బాధపడ్డారు. అమాయకులు, టూరిస్ట్ ల ప్రాణాలు పోవడంతో గుండె ముక్కలైందని చిరు అన్నారు. విక్టిమ్స్ ను చూస్తుంటే హృద‌యం బరువెక్కుతోందని.. శాంతి, న్యాయం కోసం ప్రార్థిస్తున్నానని జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ లో పేర్కొన్నారు.

మూడు నెలల క్రితం తాము అక్...