భారతదేశం, నవంబర్ 25 -- సీఎం, మంత్రులు కష్టపడి పని చేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటుందన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుందని చెప్పారు. టెక్నాలజీ సాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటున్నామని మంత్రి వెల్లడించారు.

'గృహనిర్మాణ శాఖ విషయంలో మూడు లక్షల ఇళ్లు పూర్తి చేసిన సందర్భంగా కీ హ్యాండోవర్ కార్యక్రమం నిర్వహించాం. ఆ కార్యక్రమాన్ని కూడా వైసీపీ వివాదం చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 8 లక్షల 627 ఇళ్లు పూర్తయ్యాయి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు 6 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తి అయ్యాయి.' అని మంత్రి పార్థసారథి తెలిపారు.

16 నెలల్లో మూడు లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేశామని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు....