భారతదేశం, మార్చి 10 -- తాను రష్యాకు అనుకూలంగా ఉన్నానని వస్తున్న ఆరోపణలను టెస్లా, స్టార్‌లింక్ సీఈఓ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఎలోన్ మస్క్ ఖండించారు. ఉక్రెయిన్ సైన్యం తమ స్టార్‌లింక్ ఉపగ్రహ వ్యవస్థపై ఎక్కువగా ఆధారపడి ఉందని, దానిని మూసివేయాలని నిర్ణయించుకుంటే అది కూలిపోవచ్చని ఆయన చెప్పారు. తన స్టార్‌లింక్ ఉక్రెయిన్‌లో పనిచేయడం మానేస్తే.. ఈ దేశం రష్యా చేతిలో ఓడిపోవడానికి ఎక్కువ సమయం పట్టదని వ్యాఖ్యానించారు. మస్క్, ట్రంప్ ఇద్దరూ రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణను సమర్థిస్తున్నారు. అయితే విమర్శకులు మాత్రం మస్క్ రష్యాకు అనుకూలంగా ఉన్నారని అంటున్నారు.

'ఉక్రెయిన్‌పై భౌతిక పోరాటానికి నేను పుతిన్‌ను సవాలు చేసాను. నా స్టార్ లింక్ వ్యవస్థ ఉక్రేనియన్ సైన్యానికి వెన్నెముక. నేను దానిని మూసివేస్తే వారి మొత్తం ఫ్రంట్ లైన్ కూలిపోతుంది. సంవత...