Hyderabad, ఏప్రిల్ 25 -- మలయాళం సినిమా లవర్స్ కు ఇది పెద్ద గుడ్ న్యూసే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన సోనీలివ్ ఓ 8 మలయాళం సినిమాలను ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తోంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ శుక్రవారం (ఏప్రిల్ 25) తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించింది. మరి ఆ సినిమాలేంటో చూడండి.

మలయాళం కంటెంట్ ను ఎక్కువ అందించే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో సోనీలివ్ కూడా ఒకటి. అలాంటి ఓటీటీ ఇప్పుడు తన దగ్గర ఉన్న మలయాళం సినిమాల్లో ఓ ఎనిమిది మూవీస్ ని ఎవరైనా ఫ్రీగా చూసే వీలు కల్పిస్తోంది. ఈ సినిమాల్లో థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ల మూవీస్ ఉన్నాయి.

ఇప్పటి నుంచి మే 25వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ సినిమాలు ఫ్రీగా అందుబాటులో ఉంటాయి. "మీకు కావాల్సిన వాటిన ఆస్వాదించండి. మేము అందిస్తాం. మలయాళంలోని బెస్ట్ సినిమాలను సోనీలివ్ లో ఫ్రీగా చూడండి"...