Hyderabad, మే 18 -- పొడవాటి జుట్టు కావాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. కానీ జుట్టు పెంచేందుకు ఏం చేయాలో, ఎలాంటి నూనెలు వాడాలో మాత్రం తెలియదు. మోకాళ్ల వరకు పొడవైన, మందపాటి, అందమైన జుట్టును కోరుకుంటే వీరు వాడాల్సిన నూనెలు కొన్ని ఉన్నాయి .

నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు పోషణ అందుతుంది. ఇది జుట్టును దృఢంగా, మెరిసేలా చేసి వెంట్రుకలు రాలిపోయే సమస్యను చాలా వరకు తగ్గిస్తుంది. ఆయిల్ అప్లై చేయడం వల్ల జుట్టు పొడిబారి నిర్జీవంగా కనిపించదు.

వారానికి రెండు మూడు రోజులు జుట్టుకు నూనె రాసుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది. మోకాళ్ల వరకు పొడవాటి, ఒత్తైన జుట్టు కావాలంటే సరైన నూనె ఎంపిక చేసుకోవాలి. వేసవిలో ఎలాంటి నూనెలు వాడాలో తెలుసుకోండి. ఈ అయిదు నూనెలు జుట్టుకు మేలు చేస్తాయి.

జుట్టు రాలే సమస్యతో బాధపడేవారికి బాదం ఆయిల్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. దీన్ని...