Hyderabad, ఏప్రిల్ 16 -- మీ చిన్నతనంలో ఇంట్లో ఉండే అమ్మమ్మలు, అత్తమామలు కొన్ని పదార్థాలు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదని వారించే ఉంటారు. అది గుర్తుంది కదా. అలాగే, పండ్లను తిన్న తర్వాత కూడా నీళ్లు తాగకూడదట. ఈ నియమం పాటించకపోతే ఆరోగ్యానికి హాని కలగడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివని అందరికీ తెలుసు. కానీ, కొన్ని పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగితే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అలాంటి పండ్ల గురించి తెలుసుకుందామా..

వేసవిలో రుచికరమైన కర్బూజ తినడం ఇష్టపడని వారుండరేమో. వాస్తవానికి ఇది తినడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి కూడా. ఈ కర్బూజ పండ్లలో ఉండే ఫైబర్, నీరు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అయితే, కర్బూజలో పెద్ద మొత్తంలో సహజ చక్కెర ఫ్రక్టోజ్ ఉంటుంది. కాబట్టి, కర్బూజ తిన్న వెంటనే నీళ్లు తాగితే ఆరోగ్యం దెబ్బతినే ప్...