భారతదేశం, జనవరి 6 -- సాముద్రిక శాస్త్రం ద్వారా కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. సాముద్రిక శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క పుట్టుమచ్చ వెనుక ఒక అర్థం ఉంటుంది. ఇవి చర్మంపై ఉన్న మచ్చలు మాత్రమే కాదు, ఒక వ్యక్తి తాలూకా వ్యక్తిత్వానికి అద్దం వంటివి. కొన్ని పుట్టుమచ్చలు పుట్టుకతో వస్తాయి, కొన్ని తర్వాత ఏర్పడతాయి. అయితే మనం సాముద్రిక శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, కొన్ని ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉండడం అదృష్టానికి సంకేతం.

ఆర్థికపరంగా కూడా బావుంటుందని తెలుపుతాయి. ఈ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే నిజంగా అదృష్టం వరించినట్లే. సంతోషం, సంపదతో కలకాలం ఉండొచ్చు. మరి ఏ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే సంపదతో ఆనందంగా ఉండొచ్చో తెలుసుకుందాం.

ఎవరికైనా నుదుటిపై కుడి వైపు పుట్టుమచ్చ ఉన్నట్లయితే, అది చాలా శుభప్రదమైనదిగా భావించాలి. ఈ ప్రదేశంలో పుట్టుమచ్చలు ఉన్నవారు చాలా తెల...