భారతదేశం, డిసెంబర్ 2 -- చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. నిజానికి ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించడం వలన అనేక లాభాలు కలుగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని విగ్రహాలను పెడితే కూడా అదృష్టం కలిసి వస్తుంది. సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే ప్రతి వస్తువు కూడా మన జీవితంలో ప్రభావం చూపిస్తుంది. అయితే వస్తువులను పెట్టేటప్పుడు సరైన దిశలో వాటిని పెడితే మంచిది. అలా చేయడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి, ఆనందం, ప్రశాంతత, డబ్బు కలుగుతాయి.

చాలామంది ఇళ్లల్లో రకరకాల డెకరేటివ్ వస్తువులను పెడుతూ ఉంటారు. ఇల్లు అందంగా కనిపించాలని వాటిని ఉంచుతారు. అయితే ఇల్లు అందంగా కనపడటమే కాదు, వాస్తు ప్రకారం కూడా కలిసి రావాలన్నా, అదృష్టం పెరగాలన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా వీటన్నీ ఇంట్లో పెట్టడం ...