Hyderabad, ఏప్రిల్ 16 -- కూరల్లో ఉప్పు పడితేనే దాని రుచి తెలుస్తుంది. ఉప్పు లేని ఆహారం తినడం చాలా కష్టం. ఆహారంలో ఉప్పు అతి ముఖ్యమైన భాగం. కానీ అవసరానికి మించి ఉప్పును తింటే మాత్రం ఆరోగ్యానికి విషంలా పనిచేస్తుందని అంటారు. దేనిమీదైనా ఉప్పు చల్లితే దాని రుచి పెరిగినా అది ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. రోజుకి పరిమిత మొత్తంలో ఉప్పు తినాలి. కానీ కొన్ని ఆహారాల్లో ఉప్పును వేసుకుని తినడం చాలా డేంజర్.

సాదా పెరుగును నేరుగానే తినాలి. అందులో ఉప్పు కలిపి తినడం మంచిది కాదు. ఉప్పు కలిపిన పెరుగు తినకపోవడమే ఉత్తమం. నిజానికి పెరుగులో ఉప్పు సహజంగా ఉంటుంది. కాబట్టి పెరుగులో ఉప్పును జోడించి తినడం వల్ల అందులో ఉన్న మంచి బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం పాలు, పాల ఉత్పత్తుల్లో ఉప్పును జోడించడం నిషిద్ధంగా భావిస్తారు. ఉప్పు కలిపిన పెరుగు తినడం వల్...