Hyderabad, మే 7 -- శ్వాస అనేది జీవితం అతి ముఖ్యమైన విధులలో ఒకటి. ప్రతి శ్వాస మనకు శక్తిని ఇస్తుంది. ఆరోగ్యవంతమైన శ్వాస శరీరంలోని అన్ని అవయవాలు, వ్యవస్థల పనితీరుకు మద్దతు ఇస్తుంది.

అనేక యోగాసనాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఆక్సిజనేషన్‌ను పెంచుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతాయి. కాబట్టి మన శ్వాస, ఊపిరితిత్తులు, శ్వాసకోశ ఆరోగ్యాన్ని పెంచడానికి యోగా గొప్ప మార్గం అని నిపుణులు అంటున్నారు.

స్థిరమైన యోగా అభ్యాసంతో లోతుగా శ్వాస తీసుకోవడం ద్వారా మన శ్వాసను తద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఊపిరితిత్తులను బలోపేతం చేయడానికి, శ్వాసకోశ ఆరోగ్యాన్ని పెంచడానికి యోగా సహాయపడుతుంంది.

వీపు నిటారుగా పెట్టి కూర్చొని, ఒక చేతిని ఛాతీపై, మరొక చేతిని డయాఫ్రాగమ్ మీద ఉంచండి. ఇప్పుడు సహజంగా శ్వాస తీసుకోండి. దానిని మార్చకుండా శ్వాసను గ...