Hyderabad, ఏప్రిల్ 1 -- కొన్ని ఆహారాలు అధికంగా తింటే అవి మంచి బదులే చెడే చేస్తాయి. అలాంటి విషపూరిత ఆహార పదార్థాల గురించి ఇక్కడ ఇచ్చాము. ప్రపంచంలో తినడానికి, త్రాగడానికి లెక్కలేనన్ని ఆహారాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేయవు. కొన్ని మాత్రమే ఆరోగ్యకరమైనవి. ప్రముఖ ఆయుర్వేద, యునానీ వైద్య నిపుణుడు డాక్టర్ సలీం జైదీ తన వీడియో ద్వారా అలాంటి కొన్ని ఆహార పదార్థాల గురించి సమాచారాన్ని పంచుకున్నారు. డాక్టర్ సలీం ప్రకారం, కొన్ని ఆహారాలను తక్కువగా తింటేనే ఆరోగ్యం. ఎక్కువగా తింటే అవి శరీరానికి విషంలా పనిచేస్తాయి. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

డాక్టర్ జైదీ ప్రకారం, ఆకుపచ్చ బంగాళాదుంపలు శరీరానికి విషపూరితమైనవి. బంగాళాదుంపపైన కొంత భాగం ఆకుపచ్చగా మారడం లేదా కొన్నిసార్లు మొత్తం బంగాళాదుంప ఆకుపచ్చగా ఉండటాన్న...