భారతదేశం, డిసెంబర్ 11 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకు వస్తుంది. కుజుడును గ్రహాల అధిపతి అని అంటారు. కుజుడు ధైర్యం, బలం వంటి వాటికి కారకుడు. కుజుడు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. సుమారు 45 రోజులు పాటు ఒకే రాశిలో సంచారం చేస్తాడు. ఆ తర్వాత మరో రాశిలోకి ప్రవేశిస్తాడు.

కొత్త సంవత్సరం, అంటే 2026లో కుజుడు ధనుస్సు నుంచి మకరంలోకి ప్రవేశిస్తాడు. జనవరి 16న కుజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో సూర్యుడితో సంయోగం చెందుతాడు. జనవరి 18న చంద్రుడు కూడా ఇదే రాశిలో ఉండడంతో మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడనుంది.

మహాలక్ష్మీ రాజయోగం కొన్ని రాశుల వారి ఆదాయాన్ని రెండింతలు పెంచే అవకాశం ఉంది. ఈ స...