Hyderabad, జూలై 26 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉన్నాయనేది చెప్పడంతో పాటుగా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేదిని కూడా చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారు భవిష్యత్తులో కోటీశ్వరులు అయ్యే అవకాశం కూడా ఉంది. జీవితాలను న్యూమరాలజీ ఎంతగానో ప్రభావితం చేస్తుంది. పుట్టిన తేదీ ఆధారంగా వారు ఎలాంటి వారు అనేది సులభంగా తెలుసుకోవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు.

ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ మూడు అవుతుంది. మూడు సంఖ్యకు అధిపతి గురువు. కాబట్టి ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎప్పుడూ లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉంటారు. డబ్బుకి లోటు ఉండదు. ఈ తేదీల్లో పుట్టిన వారి ఇంట్లో ఎప్పుడ...