Hyderabad, మార్చి 27 -- వేసవిలో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే అది కాంతివంతంగా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. మచ్చలు లేకుండా కాంతివంతంగా మారుస్తాయి. నిర్జీవంగా కనిపిస్తున్న చర్మాన్ని ఇంట్లో ఉన్న ఒక మూడు వస్తువులు కొన్ని గంటల్లోనే మెరిసేలా చేస్తాయి. అవే దోసకాయ, శెనగపిండి, పాలు.

వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. సూర్యకిరణాల్లోని అతినీలలోహిత కిరణాలు, గాలిలోని దుమ్ము చర్మాన్ని చికాకు పెడతాయి. అలాగే పనుల వల్ల కలిగే అలసట కారణంగా కూడా చర్మం నిర్జీవంగా మారిపోతుంది. కాబట్టి వేసవిలో చర్మ సందరక్షణ చాలా ముఖ్యం. చర్మాన్ని కాపాడుకోవడానికి లేదా మెరిసేలా చేయడానికి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చాలామంది బ్యూటీ పార్లర్ లో చుట్టూ తిరుగుతూ ఎన్నో డబ్బులు ఖర్చు పెడతారు. నిజానికి ఇంట్లో ఉన్న ఒక మూడు వస్తువు...